యాప్నగరం

Breakout Stocks: ఈ 5 బ్రేకవుట్ స్టాక్స్ అదరగొడుతున్నాయ్.. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నా లాభాలే లాభాలు..

Breakout Stocks: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంలో ఉంది. మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్ నమోదు చేశాయి. ఆ స్టాక్స్ గురించి చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 12 Apr 2023, 11:30 am
Breakout Stocks: అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు అక్కడి మార్కెట్లు క్రితం సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి. అయితే ఇదే సమయంలో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 60 వేల 220 మార్కు వద్ద ఉండగా.. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా పెరిగి 17 వేల 750 మార్కు వద్ద కదలాడుతోంది. దివీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, కోల్ ఇండియా రాణిస్తుండగా.. ఇదే సమయంలో ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే డీలాపడ్డాయి.
Samayam Telugu breakout stocks


అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్ కాంపోజిట్ సూచీ క్రితం సెషన్‌లో 0.43 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్ 0.29 శాతం పుంజుకుంది. ఇక S&P 500 ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. హాంకాంగ్ సూచీ హ్యాంగ్ సెంగ్ మినహాయించి అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. దేశీయంగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.26 శాతం పెరగ్గా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.29 శాతం పెరిగింది.

మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్న నేపథ్యంలో కొన్ని స్టాక్స్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేశాయి. ఈ స్టాక్స్ రానున్న రోజుల్లోనూ పెరిగే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

స్టాక్ పేరుCMP (రూపాయల్లో)ధరలో మార్పు (శాతాల్లో)వాల్యూమ్
Prince Pipes & Fittings Ltd. 621.3 5.8 5,37,158
Balrampur Chini Mills Ltd.424.6 2.2 15,92,499
HDFC Bank Ltd.1,674.3 0.7 23,56,356
Unichem Laboratories Ltd. 372.3 3.6 2,62,038
KPIT Technologies Ltd. 843.0 0.7 8,77,507

గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.


రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.