యాప్నగరం

Breakout Stocks: అదానీ, అంబానీ కంపెనీ షేర్ల జోరు.. బ్రేకవుట్‌ను తాకి దూకుడు!

Breakout Stocks: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు (RBI Rate Hike) ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్లలో మునుపటి కళ సంతరించుకుంది. దేశీయ మార్కెట్ సూచీలు (Stock Market Updates) భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా లాభపడగా.. కొన్ని పెన్నీ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌లను తాకాయి. ఇదే సమయంలో మరికొన్ని పెద్ద పెద్ద షేర్లు కూడా ప్రైస్ వాల్యూమ్ బ్రేక్‌అవుట్‌ను నమోదుచేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 30 Sep 2022, 1:59 pm
Breakout Stocks: వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Live) పుంజుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన అనంతరం బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఇది మార్కెట్లకు ఊతమిచ్చింది. సెన్సెక్స్ (Sensex) సుమారు 1000 పాయింట్ల మేర పెరగడం విశేషం. నిఫ్టీ కూడా 300 పాయింట్ల వరకు లాభపడింది. అయితే సెషన్ ఆరంభంలో మాత్రం నిఫ్టీ 50 కనిష్ట విలువల ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కొన్ని పెద్ద పెద్ద షేర్లు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్‌అవుట్‌ను నమోదుచేశాయి.
Samayam Telugu BREAKOUT STOCKS.
బ్రేకవుట్ స్టాక్స్


అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. మాంద్యం ముంగిట నిలిచింది. దీంతో ఆర్థిక సంక్షోభం అంచనాల నేపథ్యంలో అక్కడి మార్కెట్లు గురువారం రికార్డు స్థాయి నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 2.84 శాతం పతనమైంది. డౌ జోన్స్ 1.54 శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ 500 కూడా 2.1 శాతం తగ్గింది. ఇది రెండేళ్ల కనిష్టం కావడం ఆందోళనలను పెంచింది. శుక్రవారం సెషన్ ఆరంభంలో.. ఇది దేశీయ మార్కెట్లలో కూడా కనిపించింది. కానీ వడ్డీ రేట్ల పెంపుపై ఆర్‌బీఐ ప్రకటన అనంతరం పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయి లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ మిడ్-క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్- క్యాప్ 100 ఇండెక్స్ 0.28 శాతం లాభపడింది. సెప్టెంబర్ 29 డేటా ప్రకారం.. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FII) గురువారం రూ. 3,599.42 కోట్ల షేర్లను విక్రయించారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DII) రూ. 3,161.73 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

శుక్రవారం సెషన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్, లుపిన్ లిమిటెడ్ వంటి సంస్థల షేర్లు పెరిగాయి. ఇవి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్‌ అవుట్‌ను నమోదుచేయడం విశేషం. మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో ఈ షేర్ల ప్రైస్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

స్టాక్ పేరు సీఎంపీ (రూపాయల్లో)మార్పు (శాతాల్లో)వాల్యూమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా5322.086,87,425
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్2363.31.627,87,387
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్2090.04.311,62,177
తేజస్ నెట్‌వర్క్స్672.01.623,73,943
లుపిన్ లిమిటెడ్664.51.525,30,091


భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

ALSO READ: 5 రూపాయల షేరు.. ఊహించని రీతిలో రిటర్న్స్.. ఆలస్యమెందుకు కొనేయండి..!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.