యాప్నగరం

Penny Stocks: ఒక్కరోజే 20 శాతం పెరిగిన స్టాక్.. ఇందులో డబ్బులు పెడితే మంచి బెనిఫిట్!

Penny Stocks: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ఉంది. ఇక ఇదే సమయంలో కొన్ని రూపాయి షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందిస్తున్నాయి. ఆ స్టాక్స్ ఏంటంటే..?

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 16 Feb 2023, 2:05 pm
Penny Stocks: వరుస సెషన్ల ఒడుదొడుకుల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ దూకుడు మీద ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరగ్గా.. నిఫ్టీ మాత్రం 60 పాయింట్ల లాభంలో ఉంది. సెన్సెక్స్ ప్రస్తుతం 61 వేల 450 మార్కు వద్ద కదలాడుతుండగా.. నిఫ్టీ 18 వేల 70 వద్ద ఉంది. ఓఎన్‌జీసీ, నెస్లే, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్ లాభాల్లో ఉండగా.. ఐషర్ మోటార్స్, బజాజ్ ఫినాన్స్, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్ డీలాపడ్డాయి.
Samayam Telugu penny stocks


ఇక ఈ వార్త రాసే సమయంలో BSE నమోదిత షేర్లలో 1950 షేర్లు పెరగ్గా.. 1251 షేర్లు మాత్రం పడిపోయాయి. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం పుంజుకుంది. అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో పుంజుకోవడం వల్ల దేశీయ స్టాక్ సూచీలు కూడా లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ముందుండి నడిపిస్తున్నాయి.

ఇక మార్కెట్లు పుంజుకుంటున్న నేపథ్యంలో.. కొన్ని పెన్నీ స్టాక్స్ మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక స్టాక్ 20 శాతం వరకు పెరిగింది. ఈ స్టాక్స్ రానున్న రోజుల్లోనూ లాభాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. ఆ స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుస సంఖ్యస్టాక్ పేరుLTP (రూపాయల్లో)ధరలో మార్పు (శాతాల్లో)
1Royal India Corporation 3.0219.84
2Hindustan Bio Sciences4.1810
3Virgo Global Ltd6.314.99
4Ashoka Refineries6.334.98
5Pasari Spinning Mills7.44.96


గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.