యాప్నగరం

Penny Stocks: మార్కెట్లు పడుతున్నా ఈ పెన్నీ స్టాక్స్ అదరగొడుతున్నాయ్.. అన్నీ అప్పర్‌సర్క్యూట్ కొట్టాయ్‌గా..

Penny Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది. మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని రూపాయి షేర్లు అదరగొడుతున్నాయి. చాలా వరకు అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. ఆ స్టాక్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 24 Mar 2023, 11:56 am
Penny Stocks: భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సెషన్‌లో ఒడుదొడుకుల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు క్రితం సెషన్‌లో లాభాల్లోనే ముగిసినప్పటికీ.. ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్లను ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో దేశీయ సూచీలు నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. మరోవైపు యూఎస్ డాలర్ ‌పెరుగుతున్న నేపథ్యంలో.. రూపాయి బలహీనపడుతోంది. దేశీయ మార్కెట్లలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 57 వేల 960 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిప్టీ స్వల్ప నష్టంతో 17 వేల మార్కు ఎగువన ఉంది. అమెరికా మార్కెట్లు పుంజుకున్న నేపథ్యంలో BSE IT బెస్ట్ పెర్ఫామింగ్ సెక్టార్‌గా కొనసాగుతోంది. KPIT టెక్నాలజీస్, LTIMindtree లిమిటెడ్ దూసుకెళ్తుండటంతో పుంజుకుంటోంది.
Samayam Telugu penny stocks


మరోవైపు BSE మెటల్స్ వరస్ట్ పెర్ఫామింగ్ సెక్టార్‌గా ఉంది. అటిలిటీస్, పవర్ స్టాక్స్ పెరుగుతున్నాయి. అదానీ కంపెనీల షేర్లు చాలా వరకు అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. ఇక అపోలో హాస్పిటల్, ఇన్పోసిస్, టీసీఎస్, సిప్లా, కోటక్ మహీంద్రా లాభాల్లో ఉండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి

ఇక ఇదే సమయంలో మార్కెట్లు పడుతున్న నేపథ్యంలో కొన్ని పెన్నీ స్టాక్స్ అదరగొడుతున్నాయి. అప్పర్‌సర్క్యూట్‌లో లాకైన ఆ స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ స్టాక్స్ లిస్ట్ తెలుసుకుందాం.

వరుస సంఖ్యస్టాక్ పేరుLTP (రూపాయల్లో)ధరలో మార్పు (శాతాల్లో)
1Virgo Global Ltd7.154.99
2Archana Software Ltd44.99
3Gopal Iron & Steels Company5.694.98
4Dhanada Corporation Ltd2.744.98
5Capricorn Systems Global Solutions9.724.97

గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.