యాప్నగరం

Penny Stocks: ఫ్లాట్‌గా మార్కెట్లు.. అయినా అదరగొడుతున్న రూపాయి షేర్లు.. అన్నీ అప్పర్‌ సర్క్యూటే!

Penny Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వారాంతంలో ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ కొన్ని రూపాయి షేర్లు మాత్రం అదరగొడుతున్నాయి. అన్నీ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఆ స్టాక్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 12 May 2023, 1:00 pm
Penny Stocks: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 61 వేల 915 పాయింట్ల మార్క వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 18 వేల 294 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఐచర్ మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందాల్కో, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.
Samayam Telugu Penny Stock.


క్రితం సెషన్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ 221 పాయింట్ల మేర పడిపోయింది. అయినప్పటికీ చివరికి కోలుకుని 33,309 మార్క్ స్థాయికి చేరింది. నాస్‌డాక్ 100 ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 13,389 స్థాయికి చేరింది. కమోడిటీ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు వరుసగా 0.71, 4.8 శాతం మేర పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ రేట్లు పుంజుకున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.837.21 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.200.09 కోట్లు మేర షేర్లు కొన్నారు.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో 1622 షేర్లు పెరగగా.. 1513 షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇప్పటికీ అడ్వాస్సెస్‌కు అనుకూలంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని రూపాయి షేర్లు మాత్రం అదరగొడుతున్నాయి. ఈ పెన్నీ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వరుస సంఖ్యస్టాక్ పేరుLTP (రూపాయల్లో)ధరలో మార్పు శాతాల్లో
1Genus Prime Infra12.379.96
2JLA Infraville Shoppers3.049.75
3National Plywood Industries5.255
4Sunraj Diamond Exports6.725
5Amit International4.424.99
గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.