యాప్నగరం

Penny Stocks: అదరగొడుతున్న ఈ రూపాయి షేర్లు.. అన్నీ అప్పర్‌సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

Penny Stocks: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆరంభ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కీలక రంగాల్లో ఒత్తిడి నెలకొంది. అయితే, కొన్ని రూపాయి షేర్లు మాత్రం అందరగొడుతున్నాయి. ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపోడుతున్నాయి. అన్నీ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 24 Apr 2023, 11:39 am
Penny Stocks: స్టాక్ మార్కెట్లో లాభాలు అందుకోవాలంటే చాలా మంది పెద్ద పెద్ద కంపెనీల షేర్లతోనే సాధ్యమవుతుందని భావిస్తుంటారు. కానీ, కొన్ని రూపాయి షేర్లతోనూ మంచి లాభాలు అందుకోవచ్చు. మార్కెట్లలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ కొన్ని షేర్లు దూసుకెళ్తాయి. ఇవాళ కూడా కొన్ని పెన్నీ స్టాక్స్ అదరగొడుతున్నాయి. అన్నీ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందిస్తున్నాయి. ఆ స్టాక్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu Penny Stocks


దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్ ఫలితాలు మార్కెట్లను నడిపిస్తున్నాయి. వరుస నష్టాలకు బ్రేకులు వేశాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 59 వేల 703 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 17 వేల 638 మార్క్ వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా కాన్స్ ప్రోద్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, సిప్లా, యూపీఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

ఇవాళ బీఎస్‌ఈలో 1,714 షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా 1,301 షేర్లు నష్టాల్లోకి పడిపోయాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ప్రస్తుతం అడ్వాన్స్‌కు ఫేవర్‌గానే కొనసాగుతోంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో హెచ్‌ఎల్‌ఈ గ్లాస్కోట్ లిమిటెడ్ ఆరంభంలోనే 9 శాతం పెరిగి టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, మార్కెట్ల ఫ్లాట్‌గా కొనసాగుతున్నా ఈ 5 పెన్నీ స్టాక్స్ మాత్రం అన్నీ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఆ స్టాక్స్ లిస్ట్ తెలుసుకుందాం.

వరుస సంఖ్యస్టాక్ పేరుLTP(రూపాయల్లో)ధరలో మార్పు(శాతాల్లో)
1Kamanwala Housing Construction 8.5810
2Picturehouse Media Ltd7.399.97
3Vintron Informatics Ltd5.559.9
4Minolta Finance Ltd9.455
5R R Financial Consultants Ltd8.615
గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.