యాప్నగరం

Stock Market: ఇవాళ్టి ట్రెండింగ్ స్టాక్స్ ఇవే.. లిస్ట్‌లో ఇండియన్ ఆయిల్ షేరు.. ఒక్క రోజే ఎంత పెరిగిందంటే?

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ 3 స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఇవాళ్టి టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 17 May 2023, 2:19 pm
Stock Market: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభం నుంచే నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు.. ఏ దశలోనూ కోలుకునే పరిస్థితులు కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల పవనాలతో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. దీంతో కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయి 61 వేల 427 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 146 పాయింట్లు నష్టంతో 18 వేల 140 మార్క్ వద్ద కదలాడుతోంది. హీరో మోటో కార్ప్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Samayam Telugu trending.


మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇవాళ టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. ఆ స్టాక్స్ లిస్ట్‌లో ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేరు కూడా ఉంది. ఇవి మంచి వాల్యూమ్స్‌తో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ స్టాక్స్ తెలుసుకుందాం.

  1. సుల్జాన్ (Suzlon): భారత అతిపెద్ద పునరుత్పాదక ఇందన సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా ఉన్న సుల్జాన్ కంపెనీ తమకు వైబ్రాంట్ ఎనర్జీ నుంచి 33 విండ్ టర్బైన్ జనరేటర్లకు ఆర్డర్లు వచ్చినట్లు ప్రకటించింది. 2025 నాటికి 99 మెగా వాట్ల పవర్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులో భాగంగా ఒక్కో జనరేటర్ కెపాసిటీ 3 మెగా వాట్లతో తయారు చేసేందుకు ఆర్డర్ అందుకున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో ఈ స్టాక్ దూసుకెళ్తోంది.
  2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation): భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ క్యూ4లో 15.4 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్,2022 క్యూ3 త్రైమాసికంలో ఐఓసీ లాభం రూ.448 కోట్లుగా ఉండగా.. అది ఇప్పుడు రూ.6,900 కోట్లుగా నమోదయ్యే సూచనలు ున్నాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్ 2 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం రూ.88.26 వద్ద ట్రేడవుతోంది.
  3. పరాస్ డిఫెన్స్ (Paras Defence): మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసర్ట్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌తో కలిసి పని చేస్తున్నామని ప్రకటించిన క్రమంలో పరాస్ డిఫెన్స్ అండ్ స్పెస్ టెక్నాలజీస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా పెరిగింది. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, అట్మాస్పియరిక్ ఇన్‌స్ట్రూమెంట్స్, నెక్ట్స్ జనరలేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 6జీ, రాడార్స్, యాంటెన్నా టెక్నాలజీస్, ఫోటోనిక్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో దేశీయ డిజైన్, డెవలప్మెంట్, తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఈ కంపెనీ పాలు పంచుకుంటోంది.

గమనిక: నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. అప్‌డేట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.