యాప్నగరం

Penny Stocks: అదరగొడుతున్న రూపాయి షేర్లు.. ఇందులో డబ్బులు పెడితే కాసుల పంటే!

Penny Stocks: క్రితం సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండగా.. కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 9 Feb 2023, 11:44 am
Penny Stocks: క్రితం సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇతర అంతర్జాతీయ మార్కెట్లు కూడా పడిపోయాయి. వాల్‌స్ట్రీట్ సూచీల్లో టెక్నాలజీ స్టాక్స్ ఎక్కువగా పతనమయ్యాయి. ఒక ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్‌లో తన కొత్త AI చాట్‌బాట్ బార్డ్ తప్పుగా ఆన్సర్ చేసినందున .. అల్ఫాబెట్ 7 శాతానికిపైగా పడిపోయింది. దీంతో S&P 500 ఇండెక్స్ 1.11 శాతం మేర నష్టపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.61 శాతం పడిపోయింది. ఇక నాస్‌డాక్ ఇండెక్స్ 1.68 శాతం మేర పతనమైంది. ఇదే నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 60 వేల 700 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఫ్లాట్‌గా 17 వేల 850 మార్కు వద్ద ఉంది.
Samayam Telugu penny stocks


BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ సానుకూలంగానే ట్రేడవుతుండగా.. నిఫ్టీ ఐటీ బెస్ట్ పెర్ఫామింగ్ సెక్టార్‌గా ఉంది. ఇది 0.17 శాతం మేర పెరిగింది. ఇక నిఫ్టీ మెటల్ వరస్ట్ పెర్ఫామింగ్ సెక్టార్‌గా కొనసాగుతోంది. 1.32 శాతం వరకు నష్టపోయింది. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, గ్రేసిమ్, ఏషియన్ పెయింట్స్ రాణిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్, యూపీఎల్ మాత్రం డీలాపడ్డాయి.

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే.. ఇదే మంచి సమయమా?

మార్కెట్లు పడుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం రోజూ అప్పర్‌సర్క్యూట్‌లో లాకవుతున్నాయి. వీటిపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం. ఆ పెన్నీ స్టాక్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.

వరుస సంఖ్యస్టాక్ పేరుLTP (రూపాయల్లో)ధరలో మార్పు (శాతాల్లో)
1CORPOCO6.39.95
2ATHARVENT3.559.91
3FIRSTFIN6.725
4RSCINT5.894.99
5VINTRON6.954.98

పెన్షన్‌ తీసుకోవాలా? డిజిలాకర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండిలా..

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.


Also Read: అదానీ కంపెనీలకు భారీ నష్టాలు.. LIC, SBI లో మీ డబ్బులు సురక్షితంగానే ఉన్నాయా?
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.