యాప్నగరం

జియో ఫోన్‌కు పోటీగా.. ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్

జియో ఫోన్‌కు పోటీగా.. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లున్న ఫోన్‌ను అందించేందుకు ఎయిర్‌టెల్ సమాయత్తం అవుతోంది.

TNN 22 Aug 2017, 11:04 am
రూ. 1500కే 4జీ ఫీచర్ ఫోన్‌ను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీగా కస్టమర్లను పెంచుకునేందుకు జియో ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా రంగంలోకి దిగింది. జియో ఫోన్‌కు దీటుగా తక్కువ ధరకే 4జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది. దీపావళిలోగా.. రూ. 2500కే ఈ ఫోన్‌ను అందించే దిశగా ఫోన్ల తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ ఫోన్‌తోపాటు భారీగా డేటా, వాయిస్ మినిట్స్‌ను ఎయిర్‌టెల్ అందించనున్నట్లు సమాచారం.
Samayam Telugu to counter jio airtel plans to launch bundled 4g smartphone at rs 2500 before diwali
జియో ఫోన్‌కు పోటీగా.. ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్


అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు ఎయిర్‌టెల్ సమాయత్తం అవుతోంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఈ ఫోన్లో ఉంటుందని ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలిపారు.

రూ. 2500కే పెద్ద స్క్రీన్, మెరుగైన కెమెరా, మన్నికైన బ్యాటరీ గల ఫోన్‌ను అందించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఇందుకోసం లావా, కార్బన్ సంస్థలతో భారతీ ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతోంది. దేశంలో ఇప్పటికీ 500 మిలియన్ల మంది వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకునే సౌలభ్యం ఉన్న ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారు. వీరిని స్మార్ట్ ఫోన్ల వాడకం దిశగా ప్రోత్సహించాలని, తద్వారా భారీగా కస్టమర్లను పెంచుకోవాలని జియో, ఎయిర్‌టెల్ భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.