యాప్నగరం

ట్విట్ట‌ర్ కొత్త సీటీవో ​ ప‌రాగ్ అగ‌ర్వాల్

ట్విట్ట‌ర్ కొత్త సీటీవోగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితుల‌య్యారు. ఐఐటీలో బీ.టెక్ పూర్తిచేసిన ప‌రాగ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యం నుంచి పీహెచ్‌డీ ప‌ట్టా పొందాడు.

TNN & Agencies 9 Mar 2018, 4:49 pm
ట్విట్ట‌ర్ కొత్త సీటీవోగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితుల‌య్యారు. ఐఐటీలో బీ.టెక్ పూర్తిచేసిన ప‌రాగ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యం నుంచి పీహెచ్‌డీ ప‌ట్టా పొందాడు. సీటీవోగా అగ‌ర్వాల్ కంపెనీ టెక్నిక‌ల్ వ్యూహాలు, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేథ వంటి ముఖ్య అంశాల‌పై దృష్టిపెట్ట‌డంతో పాటు ప్రాడ‌క్ట్, అవ‌స్థాపన(ఇన్‌ఫ్రా) జ‌ట్ల‌ను స‌మ‌న్వ‌య‌ప‌రుస్తారు. అగ‌ర్వాల్ 2011లో ట్విట్ట‌ర్లో ఉద్యోగిగా చేరారు. యాడ్ ఇంజినీర్ స్థాయిలో ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన ఆయ‌న ఆన్‌లైన్ మెషీన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలో యాడ్ సిస్ట‌మ్స్ ఒక స్థాయికి వ‌చ్చేందుకు కృషి చేశారు.
Samayam Telugu twitter appoints iit bombay alumnus parag agrawal as new cto
ట్విట్ట‌ర్ కొత్త సీటీవో ​ ప‌రాగ్ అగ‌ర్వాల్



ట్విట్ల‌ర్లో చేర‌క‌ముందు ఆయ‌న అత్యున్న స్థాయి డేటా మేనేజ్మెంట్ సంబంధం ఉన్న మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూ రీసెర్చ్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్ సంయుక్త ప్రాజెక్టులో ప‌నిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.