యాప్నగరం

గుడ్ న్యూస్.. కాల్ ఛార్జీలు తగ్గుతాయ్!

జియో కారణంగా తక్కువ ధరకే ఫోన్ కాల్స్ ఎంజాయ్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్ అదే జియో పోరాటం కారణంగా..

TNN 13 Aug 2017, 12:13 pm
జియో పుణ్యమా అని దాదాపు ఏడాది కాలంగా చౌక ధరలకే మొబైల్ కాల్స్‌ చేసుకోగల్గుతున్నాం. అంబానీ దెబ్బకు మిగతా టెలీకాం సంస్థలు కూడా డేటా, కాల్స్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు ట్రాయ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఫోన్ కాల్స్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి దాకా ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేస్తే.. ఇంటర్ కనెక్ట్ ఛార్జీ (ఐయూసీ) రూపంలో నిమిషానికి 14 పైసల చొప్పున కంపెనీలపై ఛార్జీల భారం పడుతోంది. దాన్ని 10 పైసలకు తగ్గిస్తూ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu you will soon pay less for calls interconnect fee set to be cut
గుడ్ న్యూస్.. కాల్ ఛార్జీలు తగ్గుతాయ్!


కస్టమర్లు ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన జియో.. ఐయూసీని తగ్గించాలని ట్రాయ్‌ను డిమాండ్ చేస్తోంది. ఈ ఛార్జీల కారణంగా ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి. ఇంటర్ కనెక్ట్ ఛార్జీల రూపేణా దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ గత ఏడాది రూ. 10,279 కోట్లు ఆర్జించింది. ఈ ఛార్జీలను 30 పైసలకు పెంచాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.