యాప్నగరం

రూ.4990కే.. 22 వేల విలువైన ఆపిల్ వాచ్

రూ. 4990కే ఆపిల్ వాచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం. ఏంటి నమ్మడం లేదా నిజమేనండీ బాబు కాకపోతే.. ఓ కండీషన్

TNN 24 Jan 2017, 11:48 am
రూ. 4990కే ఆపిల్ వాచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం. ఈ ప్రకటనలో ఏదో తిరకాసు ఉందనుకుంటున్నారా? నిజంగానే కాస్త తిరకాసు ఉంది.. లేకపోతే రూ.23 వేలు విలువచేసే వాచ్‌ను ఐదువేల రూపాయాల్లోపే ఎందుకు అమ్ముతారు. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందట. ఐఫోన్ 7, ఆపిల్ వాచ్‌ కలిపి కొనుగోలు చేసినవారికి రూ.17,500 విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది కాబట్టి రూ. 4990కే మీకు వాచ్ లభిస్తుందన్న మాట. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ ఆఫర్ ప్రకటించింది. అంతే కాదు.. ఆపిల్ వాచ్ సిరీస్ 1 (42 ఎం.ఎం.) కేవలం రూ.6990కే సొంతం చేసుకోవచ్చు. ఈ రెండూ వద్దంటే.. ఈ ప్యాడ్ మినీ2ను రూ.1990కే పొందొచ్చు. లేదంటే.. రూ.39,900కు మ్యాక్ బుక్ ఎయిర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Samayam Telugu buy apple watch at rs 4990 with iphone 7 on flipkart
రూ.4990కే.. 22 వేల విలువైన ఆపిల్ వాచ్


మరో విషయం ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కేవలం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ జనవరి 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.