యాప్నగరం

క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన వార్నర్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు.

TNN 13 Apr 2017, 8:14 pm
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 49 పరుగుల వద్ద అవుటైన వార్నర్ రెండు పరుగులు పూర్తి చేయగానే.. క్రిస్ గేల్ రికార్డును దాటేశాడు. ఇప్పటి వరకూ 103 ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 39.02 యావర్‌తో 3512 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ 93 ఇన్నింగ్స్‌లలో 42.76 యావరేజ్‌తో 3464 పరుగులు చేశాడు.
Samayam Telugu david warner is the highest scoring overseas batsman in ipl history
క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన వార్నర్


ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సురేశ్ రైనా 4171 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి 4110 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 3883 పరుగులతో మూడో స్థానంలో, గౌతమ్ గంభీర్ 3729 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు.

ముంబైపై వార్నర్, ధవన్ జోడి బాగానే ఆడినప్పటికీ వారిద్దరూ అవుటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోవడంతో.. సన్‌రైజర్స్ తక్కువ స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. శనివారం హైదరాబాద్ జట్టు కోల్‌కతాతో తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.