యాప్నగరం

ఒక క్యాచ్‌ మ్యానేజ్.. మరో క్యాచ్‌కి అడ్డంగా బుక్..!

గాల్లోకి లేచిన బంతి బ్యాక్‌వర్ద్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ జేసన్ రాయ్ చేతిలోకి వెళ్లింది. అయితే తడబాటులో రాయ్.. బంతిని పట్టి..వదిలేసి..

TNN 17 Apr 2017, 11:31 am
ఐపీఎల్‌లో కళ్లు చెదిరే విన్యాసాలతో ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడం చూస్తున్నాం.. మరోవైపు అతి సులువైన క్యాచ్‌లు సైతం ఒత్తిడిలో మేటి క్రికెటర్లు నేలపాలు చేస్తున్న పర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా ముంబయి ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఫీల్డర్ జేసన్‌రాయ్ తప్పిదంతో ఆ జట్టు ఏకంగా మ్యాచ్‌నే కోల్పోవాల్సి వచ్చింది. ఒక క్యాచ్‌ని అతి కష్టం మీద అందుకుని స్టైల్‌గా పట్టినట్లు మేనేజ్ చేసిన జేసన్ రాయ్.. రెండో క్యాచ్‌ పట్టే సమయంలో అడ్డంగా దొరికిపోయి బంతిని నేలపాలు చేశాడు. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు నితీశ్ రాణా (53: 36 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకం బాదడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. రాణా వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ని జేసన్ రాయ్ జారవిడచడంతోనే మ్యాచ్ చేజారిందని గుజరాత్ లయన్స్ సహాయ కోచ్ మహ్మద్ కైఫ్ నిరాశ వ్యక్తం చేశాడు.
Samayam Telugu dropped catch of nitish rana cost us the game vs mumbai indians
ఒక క్యాచ్‌ మ్యానేజ్.. మరో క్యాచ్‌కి అడ్డంగా బుక్..!



తొలి ఓవర్‌ వేసిన ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో ముంబయి ఇండియన్స్ ఓపెనర్ పార్థీవ్ పటేల్ బంతిని డీప్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే గాల్లోకి లేచిన బంతి బ్యాక్‌వర్ద్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ జేసన్ రాయ్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. తడబాటులో రాయ్.. బంతిని పట్టి..వదిలేసి..మళ్లీ పట్టుకున్నాడు. మధ్యలో బంతి అతని చేతుల నుంచి రెండు మూడు సార్లు ఎగిరినా.. దాన్ని అతను స్టైల్‌గా ఎగరేసినట్లు మ్యానేజ్ చేశాడు. అయితే కొద్దిసేపటికే నితీశ్ రాణా ఇచ్చిన సులువైన క్యాచ్‌ని కూడా తడబాటులో అందుకోలేకపోయిన జేసన్ రాయ్ మ్యానేజ్ చేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. బంతి వేగంగా నేలను ముద్దాడేసింది. దీంతో అతనిపై సోషల్ మీడియాలో సెటైర్లు చెలరేగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.