యాప్నగరం

AP: తల్లిదండ్రులకు సూచన.. మోడల్‌ స్కూల్‌ అడ్మిషన్లు జరుగుతున్నాయి.. రెండు రోజులే గడువు

రాష్ట్రవ్యాప్తంగా మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

Samayam Telugu 23 Jul 2020, 1:24 pm
విశాలమైన తరగతి గదులు.. సువిశాలమైన మైదానాలు.. కాలంతోపాటే ఎన్నో ఆధునిక కోర్సులు.. ఉచిత పుస్తకాలు.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ప్రైవేట్‌కు దీటుగా అత్యత్తుమ ఫలితాలు.. ఆదర్శ పాఠశాలల్లో చదువుకోవడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి! వేలాది మందికి ఉజ్వల భవిష్యత్‌ను ఇచ్చిన ఆ విద్యా నిలయాల్లో తాజాగా ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
Samayam Telugu మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలు


ఆసక్తి గల విద్యార్థులు https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 25న ముగుస్తుంది.

ఇవి గమనించుకోండి:
  • విద్యార్హత వివరాలు చూస్తే 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించినవారై ఉండాలి.
  • ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.50 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎంట్రెన్స్ టెస్ట్ లేకుండా లాటరీ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లు పొందినవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

పూర్తి నోటిఫికేషన్‌:

apms

ఇది చదవండి: 70 శాతం మందికి ఆన్లైన్ పాఠాలు అర్థం కావట్లేదట..!

ఇది చదవండి: ఉద్యోగ నియామకాలు ప్రారంభం.. బెంగళూరు టాప్‌.. ఈ రెండు విభాగాల్లోనే అత్యధిక ఉద్యోగాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.