యాప్నగరం

AP IIIT Counselling 2022: ఈనెల 12 నుంచి ఏపీ ట్రిపుల్‌ఐటీ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..!

AP RGUKT IIIT Admission Counselling: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఎంపికైన వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 10 Oct 2022, 6:13 pm
AP RGUKT IIIT Counselling 2022: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఎంపికైన వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక్కడ పీయూసీ రెండు, ఇంజినీరింగ్‌ నాలుగు సంవత్సరాల చొప్పున మొత్తం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ విద్య అభ్యసించాల్సి ఉంటుంది. అక్టోబ‌రు 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) ప్రాంగణాల్లో, 14, 15 తేదీల్లో ఒంగోలు ప్రాంగణానికి సంబంధించి ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఎచ్చెర్లలో జరుగుతుంది.
Samayam Telugu AP RGUKT IIIT Counselling 2022


ఫీజు ఇలా.. విద్యార్థులు ప్రభుత్వ పథకాలు (విద్య, వసతి దీవెన) అర్హత లేని వారు పీయూసీలో సంవత్సరానికి రూ.45 వేలు, ఇంజినీరింగ్‌లో సంవత్సరానికి రూ.50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు నెలకు రూ.2,500 నుంచి రూ.3000 వరకు చెల్లించాలి. ప్రవేశ ఫీజు రూ.1000, (ఎస్సీ, ఎస్టీలు రూ.500), గ్రూపు బీమా కింద రూ.1,200 (ఈ సొమ్ము బీమా ఏజెన్సీకి చెల్లిస్తారు), కాషన్‌ డిపాజిట్‌ రూ.1000 (ఇది ఆఖరులో అభ్యర్థికి తిరిగి చెల్లిస్తారు), హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

అవసరమైన పత్రాలు ఇవే:
సంబంధిత బోర్డు జారీ చేసిన ఎస్‌ఎస్‌సీ/తత్సమాన పరీక్ష సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, తాజా ఈడబ్ల్ల్యూఎస్‌(2021 తర్వాత), ప్రత్యేక విభాగాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలు. పాస్‌పోర్ట్‌ ఫొటోలు అవసరమవుతాయి. పూర్తి వివరాలను https://rgukt.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

B Tech వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
APPSC AEE Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్‌ (సివిల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్‌ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.