యాప్నగరం

AP : ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలివే

APOSS : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్‌ ప్రవేశానికి తత్కాల్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Dec 2022, 12:27 pm
APOSS 10th Inter Admission 2022- 23 : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్‌ ప్రవేశానికి తత్కాల్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మచిలీపట్నం జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి రూ.300, ఇంటర్మీడియట్‌కు రూ.400 చొప్పున అపరాధ రుసుము చెల్లించి డిసెంబ‌రు 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 13వ తేదీ వరకు ప్రవేశ ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Samayam Telugu APOSS 10th Inter Admission 2022-23


వచ్చే వారం CUET 2023 షెడ్యూల్‌ విడుదల..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( NTA) త్వరలో CUET 2023 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే వారంలో ఈ షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్‌ల కోసం ఎప్పటికప్పుడు CUET వెబ్‌సైట్‌ని http://cuetsamarth.edu.in/ చూస్తూ ఉండాలి. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి CUET 2023 రాయాల్సి ఉంటుంది. ఢిల్లీ యూనివర్శిటీతో (Delhi University) సహా అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు CUET స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తాయి.

13 భాషల్లో ఆన్‌లైన్ మోడ్‌లో పరీక్ష:
CUET పరీక్ష గత సంవత్సరం 13 భాషలలో నిర్వహించబడింది. ఈ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రూపంలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష సిలబస్ గత సంవత్సరం మాదిరిగానే 12వ తరగతి అంశాల ఆధారంగా రూపొందించబడింది. గతేడాదికి భిన్నంగా సిలబస్‌ ఉండకపోవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి జనరల్, మరొకటి సంబంధిత సబ్జెక్ట్ కు ఉంటుంది.

జనరల్ విభాగంలో.. అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ మరియు ఎనలిటికల్ మరియు లాజికల్ రీజనింగ్ మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సబ్జెక్ట్ ఆధారిత విభాగంలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులపై ప్రశ్నలు వస్తాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్ మరియు ఇతర సబ్జెక్టుల వంటివి. CUET 2023 పరీక్ష బహుళ ఎంపిక ఆధారిత ప్రశ్నలపై ఆధారపడి ఉంటుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.