యాప్నగరం

BRAOU: దూరవిద్యలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు

దూరవిద్యలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

Samayam Telugu 23 Jun 2020, 9:05 pm
ఉద్యోగం చేస్తూ చదువుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మీ లాంటి వారి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. దూరవిద్యా విధానంలో బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలను పూర్తి చేసుకోవచ్చు.
Samayam Telugu BRAOU


దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకునేవారికోసం అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది. ప్రవేశాల కోసం ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా నిర్వహిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణులు కాని వారు కూడా 2020 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండితే చాలు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయవచ్చు.

ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు నేరుగా డిగ్రీలో అడ్మిషన్‌ పొందొచ్చు. ఇక ఇంటర్ పాసైనవాళ్లు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా డిస్టెన్స్ డిగ్రీలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే గతంలో అంటే 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయినవాళ్లు మళ్లీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు.

వాస్తవానికి బీఆర్ఏఓయూ ఎలిజిబిలిటీ టెస్ట్-2020 ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ పరీక్ష వాయిదా పడింది. దీంతో ఈ పరీక్ష జూలై 12న జరగనుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో ఈ పరీక్ష ఉంటుంది.

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా దరఖాస్తు చేయలేకపోయిన వారు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.braouonline.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.