యాప్నగరం

BRAOU: అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం

braouonline.in: డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో పాటు పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Samayam Telugu 23 Jun 2021, 1:35 pm

ప్రధానాంశాలు:

  • అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ అడ్మిషన్లు
  • డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
  • వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ప్రవేశాలు
హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న డాక్టర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (BRAOU) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది. జూన్‌ 23 నుంచి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతో పాటు పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.
ఆయా కోర్సుల్లో చేరడానికి అవసరమైన విద్యార్హతలు, పరీక్ష ఫీజు, ముఖ్యమైన తేదీలు తదితర వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే 2021-22 అకడమిక్‌ ఇయర్‌లో ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు సెకండియర్‌ ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు సైతం ఆగస్టు 12వ తేదీ లోగా ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు.

TS EAMCET పరీక్ష తేదీలు ఖరారు.. పూర్తి వివరాలివే

1. ఏపీ: కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో 6, 11వ తరగతి ప్రవేశాలు
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో 2021–22 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 11వ తరగతి (ఇంటర్‌ ఫస్టియర్‌) ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ఓ ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.