యాప్నగరం

TS DOST‌ సీట్ల కేటాయింపు వాయిదా.. మొదటి జాబితా ఎప్పుడంటే..?

2020-21 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడత సీట్ల కేటాయింపు వాయిదా పడింది.

Samayam Telugu 16 Sep 2020, 2:41 pm
డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా 2020-21 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబ‌రు 21వ తేదీకి వాయిదా పడింది. సెప్టెంబ‌రు 16వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. కానీ 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చినందున ఆలస్యమైవుతున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu దోస్త్‌ ప్రవేశాలు 2020


సీట్ల కేటాయింపు ఈనెల 21న జరగనుంది. అదే రోజు నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. రెండోవిడత రిజిస్ర్టేషన్స్‌.. వెబ్‌ ఆప్షన్స్‌ ఈనెల 17కు బదులు 21 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. తొలివిడత రిజిస్ర్టేషన్‌ ఈనెల 7తో ముగియాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రెండురోజులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 16న సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటించాలి. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Must read: RIMS ‌లో 41 పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.