యాప్నగరం

విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల్లో నిబంధనలు సడలింపు..!

ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను కొంత సడలించారు.

Samayam Telugu 22 Sep 2020, 7:58 am
ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను కొంత సడలించారు. దీంతో అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభించింది. మామూలుగా.. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్‌ 20 పర్సంటైల్‌ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
Samayam Telugu ఐఐటీ ఎన్‌ఐటీ అడ్మిషన్లు 2020


Must read: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020లో విజయం సాధించడానికి మార్గాలివే..!

కరోనా నేపథ్యంలోనే..!
  • కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.
  • ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్‌ సాధించి ఉండాలి.
  • కరోనా కారణంగా ఈ ఏడాది అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు.
  • ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Also read: ఐబీపీఎస్‌ 2557 బ్యాంక్ ఉద్యోగాలు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్ ఇదే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.