యాప్నగరం

GPAT: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్-2020

GRADUATE PHARMACY APTITUDE TEST 2020 | ఫార్మసీలో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్న పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్).. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది..

Samayam Telugu 5 Nov 2019, 6:41 pm
ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2020 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' విడుదల చేసింది. ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
Samayam Telugu GPAT


వివ‌రాలు..


Read Also: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్..

* గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్‌) 2020

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత, ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు..

➦ జ‌న‌ర‌ల్/ జ‌న‌ర‌ల్-EWS /ఓబీసీ(నాన్‌క్రీమిలేయ‌ర్) బాలురకు రూ.1600, బాలికలకు రూ.800.

➦ ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ట్రాన్స్‌జెండ‌ర్- బాలురకు రూ.800, బాలికల‌కు రూ.800.

పరీక్ష విధానం...

మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు.

పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.

ఒక్కో తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2019

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2019 (11:50 p.m.)

➥ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 01.11.2019 - 01.12.2019

➥ పరీక్ష కేంద్రం - నగరం ఎంపిక: 01.11.2019 - 02.12.2019 (11:50 p.m.)

➥ పరీక్ష తేది: 28.01.2020

➥ పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:30 గం. - సా. 5:30 గం.

➥ ఫలితాల వెల్లడి: 07.02.2020

Admission Notification

Online Application

APPSC News:
Read More..
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . . .మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.