యాప్నగరం

VIT SRM: బీటెక్‌ ప్రవేశ పరీక్షలు రద్దు.. ఇంటర్‌ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు

తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు బీటెక్‌ ప్రవేశ పరీక్షలను రద్దు చేశాయి.

Samayam Telugu 15 Jul 2020, 9:10 am
ప్రపంచమంతా కరోనా నామస్మరణ చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అన్నీ వ్యస్థలు చిన్నాభిన్నమైపోయాయి. అన్నీ చోట్లా స్కూళ్లు మూతబడ్డాయి.. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌), ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు బీటెక్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలను రద్దు చేశాయి.
Samayam Telugu ప్రవేశ పరీక్షలు రద్దు


కరోనా నేపథ్యంలో ప్రవేశపరీక్షలను రద్దుచేసి ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు విడుదల చేసాయి.

విద్యార్థులకు ఇంటర్మీడియెట్ లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కోర్సుల్లో చేరవచ్చు. అదేవిధంగా జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు విట్‌ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్‌సైట్లు‌ చూడవచ్చు.


  • ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో బీటెక్‌ ప్రవేశాల వివరాలకు https://www.srmist.edu.in/ చూడొచ్చు.

Also read: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హైస్కూళ్లలో ఇంటర్ కాలేజీల ఏర్పాటు..!

Also read: టెన్త్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. హాల్ టికెట్ పొందిన ప్రతి ఒక్కరూ పాస్

Also read: ఎన్టీపీసీ 275 ఉద్యోగాలకు ప్రకటన.. ఇంజనీరింగ్ అర్హత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.