యాప్నగరం

TS Inter 1st Year Admissions 2022: నేటి నుంచి తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు.. జులై 11 నుంచి తరగతులు.. పూర్తి వివరాలివే

TS Inter First Year Admission Schedule 2022: తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జులై 1 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలంగాణ ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 1 Jul 2022, 12:07 pm
TS Inter First Year Admission Schedule 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలన్నింటిలో మొదటి సంవత్సరం ప్రవేశాలు శుక్రవారం (జులై 1) నుంచి ప్రారంభమయ్యాయి. అన్నీ కాలేజీలకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు గురువారం (జూన్‌ 30) ప్రకటించింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇంటర్‌బోర్డు ఈ సందర్భంగా తెల్పింది.
Samayam Telugu TS Inter 1st Year Admissions 2022


తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జులై 1 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలంగాణ ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

TS TET Results 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి
జులై 11 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇక.. మొదటి విడత ప్రవేశాలు ఆగస్టు 17తో ముగుస్తాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేపట్టాలని బోర్డు అన్ని జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్లకు సూచించింది. ఐతే పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్, టీసీ సమర్పించిన తర్వాత మాత్రమే అడ్మిషన్‌ నిర్ధరణ అవుతుంది.

అడ్మిషన్ కోసం ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపట్టిన జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అలాగే మొత్తం సీట్ల సంఖ్య, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను తెలుపుతూ నోటీసును ప్రతి కాలేజీ బయట ఉంచాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ https://acadtsbie.cgg.gov.in/ లేదా https://tsbie.cgg.gov.in/లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.