యాప్నగరం

TS LAWCET Exam Date: లాసెట్-2019 షెడ్యూలు విడుదల

లాసెట్-2019 పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల కాలపరిమితితో ఎల్‌ఎల్‌బీ కోర్సు, రెండేండ్ల కాలపరిమితితో ఎల్‌ఎల్‌ఎం(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Samayam Telugu 24 Feb 2019, 10:27 am
తెలంగాణలోని న్యాయకళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన లాసెట్ షెడ్యూలు విడుదలైంది. షెడ్యూలు ప్రకారం మార్చి 10న లాసెట్-2019 నోటిఫికేషన్ విడుదలకానుంది. అభ్యర్థుల నుంచి మార్చి 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు నిర్ణయించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మే 20న ఆన్‌లైన్ విధానంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల కాలపరిమితితో ఎల్‌ఎల్‌బీ కోర్సు, రెండేండ్ల కాలపరిమితితో ఎల్‌ఎల్‌ఎం(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టింది.
Samayam Telugu lawcet


పరీక్ష ఫీజు ఇలా..
ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రూ. 500, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు. పీజీఎల్‌సెట్‌కు ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.1000గా నిర్ణయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.