యాప్నగరం

TS Inter Practical Exams: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్.. పూర్తి వివరాలివే

TS Inter Exam 2022: ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్స్ (Inter Practical Exams) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు చదువుతున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

Samayam Telugu 4 Feb 2022, 5:43 pm
TS Intermediate Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్స్ (Inter Practical Exams) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు చదువుతున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించి, త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి తెలిపారు.
Samayam Telugu ఇంటర్‌ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌


గతేడాది కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ వర్క్ అసైన్‌మెంట్స్ ప్రాక్టికల్‌గా ఇచ్చారు. ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, కాలేజీలో తిరిగి తెరుచుకోవడంతో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే.. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేస్తారని అధికారులు తెలిపారు.

UPSC Jobs: డిగ్రీ చదివిన వారికి సూపర్‌ ఛాన్స్‌.. 1012 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మంచి హోదాతో పాటు భారీస్థాయిలో జీతం
విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు ఇవ్వడం జరుగుతుందని, వాటిని ఇళ్ల వద్ద పూర్తి చేసి, కాలేజీల్లో సబ్‌మిట్ చేయాలన్నారు. ఇదిలాఉంటే.. మే లో పబ్లిక్ ఇగ్జామ్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. 70 శాతం సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్ష పత్రంలోనూ కీలక మార్పులు ఉంటాయంటున్నారు. విద్యా్ర్థులకు ఎక్కువ ఆప్షనల్ ప్రశ్నలు ఉండేలా ప్రశ్న పత్రం రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ఇక.. తెలంగాణలోని విద్యాసంస్థ (Telangana Schools and colleges)ల్లో ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు, ఆన్లైన్ క్లాసులు కూడా బోధించాలని హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.