యాప్నగరం

టీఎస్‌: ఇంటర్‌ ఫలితాలు విడుదల తేదీ, టైమ్‌పై నేడు స్పష్టత..?

టీఎస్‌ ఇంటర్‌ ఫలితాల విడుదల తేదీ, సమయంపై ఈ రోజు ఇంటర్‌ బోర్డు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Samayam Telugu 17 Jun 2020, 12:12 pm
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నేడు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు సమావేశమై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ఇంటర్‌ ఫలితాలు


అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు మూడు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. గతేడాది జరిగిన అనుభవాల ద`ష్ట్యా ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు.

Also read: టిమ్స్‌లో 499 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల.. 3 రోజులే గడువు.!

అలాగే ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని చూస్తుండటంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు బుధ, గురు వారాల్లో విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Also read: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి పీజీసీఐఎల్‌ ప్రకటన విడుదల

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.