యాప్నగరం

AP EAPCET 2022: ఏపీ ఎంసెట్‌కు భారీ సంఖ్యలో అప్లికేషన్లు.. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కే..

AP EAMCET Hall Ticket Download 2022: ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2022) ఈ నెల 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 2 Jul 2022, 10:56 pm
AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2022) ఈ నెల 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో ఈఏపీ సెట్‌లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు.
Samayam Telugu AP EAPCET 2022


Viral News: ప్రతి ఇంటర్వ్యూలోనూ నిరాశే.. విసిగిపోయిన యువకుడు.. ఉద్యోగం కోసం విచిత్ర ప్రయత్నం.. ఆఫీస్‌ల బయట QR కోడ్ ఏర్పాటు..
దరఖాస్తుల వెల్లువ:
AP EAPCET 2022 పరీక్షకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా 3 లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గరిష్ట ఆలస్య రుసుము గడువులో సైతం దరఖాస్తులు సమర్పిస్తుండడం విశేషం. జూన్‌ 30వ తేదీ (గురువారం) వరకు 3,01,113 మంది రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. వీరిలో 2,99,951 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించారు. AP EAMCET 2022 రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఇంకా గడువు ఉన్నందున ఈసారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. వీరిలో 1,91,370 మంది ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ అభ్యర్థులు.. 78,381 మంది అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.