యాప్నగరం

AP ECET 2023 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

AP ECET Exam Postponed : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించ తలపెట్టిన ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (AP ECET-2023) వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 25 Apr 2023, 2:04 pm
AP ECET 2023 : ఆంధ్రప్రదేశ్‌లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు AP ECET 2023 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (AP ECET-2023) వాయిదా పడింది. మే 5న నిర్వహించవలసిన ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు వెల్లడించారు. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.
Samayam Telugu AP ECET 2023 Exam


AP ECET 2023
  • కోర్సులు: బీటెక్, బీఈ, బీఫార్మసీ.
  • అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
  • దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం: AP ECET ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.
  • పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు AP ECET పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. పరీక్ష జూన్‌ 20వ తేదీ ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు ఉంటుంది.

పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్‌ చేయండి

Tech Mahindra : టెక్‌ మహీంద్ర ఉచిత ట్రెయినింగ్‌తో పాటు జాబ్‌ ఇస్తారు.. పూర్తి వివరాలివే

EPFO : ఇంటర్‌ అర్హతతో 185 ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రారంభంలోనే నెలకు రూ.25,500 జీతం
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.