యాప్నగరం

APRJC CET 2022: ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష తేదీ వెల్లడి

aprs.apcfss.in APRJC CET 2022 Exam Date: ఈ ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్‌ 28 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Apr 2022, 3:05 pm
APRJC CET 2022 and APRDC notification 2022 Exam date: ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 28 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తివివరాలకు https://aprs.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu ఏపీఆర్‌జేసీ సెట్‌ 2022


SBI Youth for India Fellowship 2022: నెలకు రూ.16,000 స్టైపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌.. ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు
SBI Youth for India Fellowship 2022-23: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) - ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌-2022 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://youthforindia.org/ వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి:

AP Inter Hall Ticket 2022: ఇంటర్‌ హాల్‌టికెట్లు రెడీ.. jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి ఇలా పొందవచ్చు
AP Inter Hall Ticket 2022: మే 6వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు సిద్ధం చేసింది. ఈ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు (థియరీ) హాజరు కానున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల హాల్‌ టికెట్లు (జనరల్, ఒకేషనల్‌) ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ (జ్ఞాన భూమి- https://jnanabhumi.ap.gov.in/) లాగిన్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్‌ టికెట్లు పొందాలన్నారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాల్లోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు తెలియజేయాలని సూచించారు.

AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో ఏడాది పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ మారడంతో ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మార్పు చేసింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 23వ తేదీతో ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మే 7వ తేదీ నుంచి మే 24 వరకు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాయి.

TSPSC Group 1 Exam Pattern: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష విధానం.. సిలబస్‌.. ముఖ్యమైన టాపిక్స్‌ ఇవే..!
ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్
  • మే 6వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • మే 9వ తేదీ ఇంగ్లీష్ పేపర్-1
  • మే 11వ తేదీ మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
  • మే 13వ తేదీ మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • మే 16వ తేదీ ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
  • మే 18వ తేదీ కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
  • మే 20వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
  • మే 23వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ షెడ్యూల్
  • మే 7వ తేదీ సెకండ్ లాంగ్వేష్ పేపర్-II
  • మే 10వ తేదీ ఇంగ్లిష్ పేపర్-II
  • మే 12వ తేదీ మ్యాథ్స్ పేపర్-II-A
  • మే 14న తేదీ మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
  • మే 17వ తేదీ ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
  • మే 19వ తేదీ కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II , సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
  • మే 21వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)
  • మే 24వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.