యాప్నగరం

APSET-2020 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు ప్రారంభం

స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్‌‌) 2020 ప్రక‌ట‌నను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది.

Samayam Telugu 10 Aug 2020, 10:13 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాల‌యాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల‌కు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్‌‌) ప్రక‌ట‌నను విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆగ‌స్టు 14న ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ https://www.andhrauniversity.edu.in/, https://apset.net.in/లో అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొంది.
Samayam Telugu ఏపీసెట్‌ 2020


Also read: టీఎస్‌ ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ తేదీలు ఖరారు.. కొత్త తేదీలు ఇవే..!

ముఖ్య సమాచారం:
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ‌(ఏపీసెట్)‌- 2020
  • ఎంపిక‌: ఏపీ సెట్ ద్వారా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఆగస్టు14, 2020
  • దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబ‌ర్ 19, 2020
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు ‌రూ.1200, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ట్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థుల‌కు రూ.700
  • రాత‌పరీక్ష‌: ‌డిసెంబ‌ర్ 6, 2020
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apset.net.in/
Also read: డిగ్రీ కావాలంటే.. తప్పక పరీక్షలు రాయాల్సిందే.. ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలపై యూజీసీ స్పష్టీకరణ

Also read: 30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.