యాప్నగరం

January 1st నుంచి CLAT 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

CLAT 2022 Registrations: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2022 జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. క్లాట్‌ 2022 పరీక్ష మే 8న జరగనుంది. వివరాల్లోకెళ్తే..

Samayam Telugu 31 Dec 2021, 6:54 pm
CLAT Exam 2022: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి క్లాట్‌ 2022 జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 దరఖాస్తు ఫారమ్ https://consortiumofnlus.ac.in/ లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
Samayam Telugu కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2022


దరఖాస్తు చేయడానికి మార్చి 31, 2022 చివరి తేది. క్లాట్‌ 2022 పరీక్ష మే 8న జరగనుంది. పరీక్ష సమయాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి.

తెలంగాణలో ఏప్రిల్‌ నెలాఖరులో ఇంటర్‌ వార్షిక పరీక్షలు..? తర్వాత టెన్త్‌ పరీక్షలు కూడా..!
ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి:
  • కన్సార్టియం అధికారిక వెబ్‌సైట్ https://consortiumofnlus.ac.in/ ఓపెన్‌ చేయాలి.
  • CLAT 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి నమోదు చేసుకోవాలి.
  • అన్నీ వివరాలను నమోదు చేసి.. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించి ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు ఫీజు:
రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.3500, జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.4000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

క్లాట్‌తో 22 ఎన్‌ఎల్‌యూల్లో ప్రవేశాలు:
ఈ క్లాట్‌ 2022 ప్రవేశ పరీక్షను 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం జాతీయ స్థాయి న్యాయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. UG-CLAT 2022 పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, లీగ్, లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టుల నుంచి 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి.

రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.