యాప్నగరం

గేట్-2021 అభ్యర్థులకు అలర్ట్‌.. అప్లికేషన్‌లో వివరాలు మార్చుకునే ఛాన్స్..!

గేట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేసుంటే సరి చేసుకోవచ్చు.

Samayam Telugu 28 Oct 2020, 6:16 pm
గేట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ-ముంబై కీలక మరోఅవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేసుంటే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో అభ్యర్థులు పరీక్ష రాసే సిటీ, కేటగిరీ, జెండర్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. పరీక్ష కేంద్రాన్ని ఉచితంగానే మార్చుకునే అవకాశం కల్పించారు. కేటగిరీ, జెండర్, పేపర్ మార్చుకోవడానికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
Samayam Telugu గేట్‌-2021


అప్లికేషన్ కరెక్షన్ అవకాశం అక్టోబర్‌ 28 నుంచి నవంబర్ 13 వరకు ఉంటుంది. అయితే ఓకే సారి మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను మార్చుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను https://www.gate.iitb.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Must read: GATE 2021 పరీక్షలో అనేక మార్పులు.. కొత్త పరీక్ష విధానం ఇదే..!

ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న గేట్‌-2021 పరీక్షలో ఐఐటీ బాంబే కొన్ని మార్పు‌లు చేసింది. కొత్త పేపర్లను చేర్చింది.. అర్హతల్లో మార్పులు చేసింది. ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన మార్పులతో గేట్‌-2021 ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంజినీరింగ్, సైన్స్‌ విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి ప్రధానంగా ఉద్దేశించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్‌ విద్యార్థులనూ తన పరిధిలోకి తెచ్చుకుంది.

Also read: గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు.. ప్రత్యేక ఫిర్యాదుల సెల్‌ ఏర్పాటు.. కంట్రోల్‌ రూం నెంబర్లు ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.