యాప్నగరం

ఐఐటీల్లో ప్రవేశాలకు 75 శాతం మార్కుల నిబంధన ఎత్తివేత.. తాజా సవరణలు ఇక్కడ తెలుసుకోవచ్చు

ఐఐటీల్లో ప్రవేశాల విషయంలో హెచ్‌ఆర్డీ తీసుకున్న తాజా నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులకు ఊరట లభించింది.

Samayam Telugu 20 Jul 2020, 8:41 am
ఐఐటీల్లో చేరాలనేది లక్షలాది మంది విద్యార్థుల కల. ఇక్కడ సీటు కోసం ఇంటర్‌ ప్రారంభం నుంచే సన్నద్ధమవుతుంటారు. రకరకాల కోచింగ్‌లు తీసుకుంటారు. జేఈఈకి ప్రిపేరవుతుంటారు. కానీ ఇప్పటి వరకు జేఈఈలో ర్యాంకుతో పాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు వస్తేనే ఐఐటీల్లో ప్రవేశం అనే నిబంధన ఉండేది.
Samayam Telugu ఐఐటీల్లో ప్రవేశాలు


అయితే ప్రస్తుతం ఈ నిబంధనను ఎత్తివేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ఐఐటీలు, జేఏబీ నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేదా ఆ రాష్ట్ర బోర్డులో మొదటి 20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధనను ఎత్తివేశారు. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ ప్రక్రియలో సడలింపులు ఇస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

12 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన క్వాలిఫైడ్‌ అభ్యర్థులు వారి మార్కులతో నిమిత్తం లేకుండానే ఐఐటీ ప్రవేశాలకు అర్హత పొందుతారని తెలిపారు. ఇప్పటి వరకు జేఈఈ(అడ్వాన్స్‌డ్‌)లో అర్హత సాధించడంతోపాటు 12వ తరగతిలో కనీసంగా 75 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే ఐఐటీలో ప్రవేశానికి అర్హత లభించేది. హెచ్‌ఆర్డీ తాజా నిర్ణయంతో పలువురు విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. పూర్తి వివరాలు http://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

JEE Advanced 2020 Eligibility Criteria:
  • Performance in JEE Main 2020
  • Age limit
  • Number of attempts
  • Appearance in 12th (or equivalent) Examination
  • Earlier Admissions at IITs

Also read: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా

Also read: ఆగస్టు 3 కాదు.. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు రీ ఓపెన్..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.