యాప్నగరం

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక కీ విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రాథమిక కీ నేడు (సెప్టెంబర్‌ 29) వెలువడనుంది.

Samayam Telugu 29 Sep 2020, 8:51 am
జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు (సెప్టెంబర్‌ 29) వెలువడనుంది. ఈనెల 27 నిర్వహించిన పేపర్‌–1, పేపర్‌–2 ప్రశ్నపత్రాల కాపీలను పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ– ఢిల్లీ సోమవారం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కీ విడుదల చేశాక విద్యార్థుల నుంచి ఈ నెల 30 సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది.
Samayam Telugu జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020


అనంతరం అక్టోబర్‌ 5న తుది ‘కీ’ని, ర్యాంకుల జాబితాను విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా 1.60 లక్షల మంది మాత్రమే పరీక్షకు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

నమోదు చేసుకున్న వారిలో 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌–1కు 1.51 లక్షలు, పేపర్‌ 2కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. అక్టోబర్‌ 6 నుంచి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్‌ 9 వరకు మొత్తం 6 విడతల కౌన్సెలింగ్‌ ద్వారా మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

అభ్యర్థులు ఒకే రకమైన మార్కులతో సమానంగా ఉంటే నెగెటివ్‌ సమాధానాలివ్వని, ఎక్కువ పాజిటివ్‌ మార్కులున్న అభ్యర్థులకు మెరుగైన ర్యాంక్‌ ఇస్తారు. అందులోనూ సరిసమానంగా అభ్యర్థులుంటే వారిలో గణితంలో ఎక్కువ స్కోరు ఉన్నవారికి అధిక ర్యాంకు కేటాయిస్తారు. ఆ తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సమాన స్థాయిలోఅభ్యర్థులుంటే నిబంధనల మేరకు ర్యాంకులు కేటాయిస్తారు.

Must read: కేంద్ర ఐటీ శాఖలో జాబ్స్.. నెలకు రూ.60 వేలు జీతం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.