యాప్నగరం

JEE Main 2021: జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. దరఖాస్తు గడువు పొడిగింపు

JEE Main 2021 Registration Date Extended: దరఖాస్తుల్లోని పొరపాట్లను జ‌న‌వ‌రి 27 నుంచి 30 వరకు సవరించుకోవచ్చు.

Samayam Telugu 18 Jan 2021, 11:20 am
జేఈఈ మెయిన్‌ మొదటి విడతకు దరఖాస్తు గడువును జ‌న‌వ‌రి 23వరకు పెంచుతున్నట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ). 2021-22 నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌లో మదన్‌మోహన్‌ మాలవ్య సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Samayam Telugu జేఈఈ మెయిన్‌ 2021


ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జ‌న‌వ‌రి 16తో గడువు ముగిసింది. దరఖాస్తుల్లోని పొరపాట్లను జ‌న‌వ‌రి 27 నుంచి 30 వరకు సవరించుకోవచ్చని.. ఫిబ్రవరి 2వ వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. పూర్తి వివరాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

నాలుగు సార్లు:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తలే వచ్చే ఏడాదిలో జరిగే పరీక్షల్లోనూ విద్యార్థులు పాటించాలని స్పష్టంచేసింది. తొలి విడత పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తామని తెలిపిన ఎన్టీఏ.. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో మరో మూడు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షలను విద్యార్థులు ఒకేసారి రాయొచ్చు లేదా నాలుగు సార్లయినా రాసేందుకు వెసులుబాటు కల్పించింది.

ఒకవేళ నాలుగు సార్లు రాసినా ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోనున్నారు. మే తర్వాత లేదా జూన్‌ చివరి వారంలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇక సిలబస్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా..‌ యథాతథంగా ఉండనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.