యాప్నగరం

JEE Main 2023 : ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్‌..? రేపే కీలక ప్రకటన వెలువడే అవకాశం..?

JEE Main - NTA : డిసెంబర్‌ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్‌ను వెలువరించే అవకాశం ఉంది. నవంబర్‌ 27న పరీక్ష తేదీలు, రిజిస్ట్రేషన్‌ తేదీలు వంటి అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 26 Nov 2022, 3:38 pm
JEE Main 2023 : దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ జేఈఈ మెయిన్స్‌ (JEE Main 2023) ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్‌ను వెలువరించే అవకాశం ఉంది. నవంబర్‌ 27న పరీక్ష తేదీలు, రిజిస్ట్రేషన్‌ తేదీలు వంటి అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ బోర్డుల అభిప్రాయాలను కోరింది. ఫిబ్రవరిలో నిర్వహణ అంశంపై.. కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి.
Samayam Telugu JEE Main 2023 Exam


ఈ సారి రెండు విడతలుగానే నిర్వహణ:
కరోనా సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్స్‌ నిర్వహించారు. ఈసారి 2 విడతలుగానే చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో తొలి విడత ఉంటే.. ఏప్రిల్‌లో రెండో విడత ఉండొచ్చన్న సంకేతాలు ఎన్‌టీఏ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏప్రిల్‌లో రాష్ట్రాల పరిధిలోని ఇంటర్‌ బోర్డులు పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈ ప్రక్రియను మే నెలలో చేపట్టాలని భావిస్తోంది. జూన్‌ లేదా జూలైలో అడ్వాన్స్‌డ్‌ చేపట్టి, సెప్టెంబర్‌ నాటికి ప్రవేశాల ప్రక్రియను ముగించాలనే యోచనలో ఉంది.

ఇందుకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా 2023–24 సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి అభిప్రాయాన్ని కూడా ఎన్‌టీఏ కోరినట్టు తెలిసింది. మరోవైపు పరీక్ష విధానంపైనా ఎన్‌టీఏ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టు తెలిసింది. పార్ట్‌–1కు మాత్రమే కరోనా కాలంలో నెగెటివ్‌ మార్కింగ్‌ అమలు చేశారు. 360 మార్కులతో 90 ప్రశ్నల విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.