యాప్నగరం

TS: సెప్టెంబర్‌ 9 నుంచి ఎంసెట్‌.. 2న పాలిసెట్.. ఈ నెల 31న ఈసెట్.. త్వరలో మిగిలిన పరీక్షలపై స్పష్టత

ప్రవేశ పరీక్షల తేదీలను హైకోర్టుకు తెలిపి కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Samayam Telugu 11 Aug 2020, 9:10 am
రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Samayam Telugu ప్రవేశ పరీక్షలు


సెప్టెంబర్‌లో నీట్‌ ఉండటం, అదే నెలలో ఏపీ ప్రభుత్వం కూడా పరీక్షలు నిర్వహిస్తుండంతో.. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది. పీఈ సెట్‌ మినహా మిగిలిన పరీక్షలను వచ్చే నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసు కున్నారు. ఈ నిర్ణయాలను హైకోర్టుకు తెలిపి కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని భావిస్తున్నారు.

Also read: సదరన్ రైల్వేలో 201 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

Also read: JAM 2021 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.