యాప్నగరం

TS Edcet 2022: తెలంగాణ ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పెంపు.. ముఖ్యమైన తేదీలివే

TS EdCET 2022 Registration: తెలంగాణ ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని జులై 6 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ ప్రకటించారు. పూర్తి వివరాల్లోకెళ్తే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 23 Jun 2022, 3:44 pm
TS Edcet 2022 Application last date extended till July 6: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2022 దరఖాస్తు గడువు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని జులై 6 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ ప్రకటించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో https://edcet.tsche.ac.in/ ఆలస్య రుసుము లేకుండా జులై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Samayam Telugu TS Edcet 2022


ఇక.. తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఎడ్ సెట్‌ ర్యాంక్‌ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహిస్తోంది.

ఈ ప్రవేశ పరీక్షకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే. అభ్యర్థులు పూర్తి వివరాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.