యాప్నగరం

TS ICET-2020 పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవచ్చు.. ఆఖరు తేది ఎప్పుడంటే..?

టీఎస్‌ ఐసెట్‌-2020 రాసే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించారు.

Samayam Telugu 4 Aug 2020, 8:20 am
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌-2020 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాలను మార్చుకోవడానికి ఆగస్టు 6 వరకు గడువు విధించినట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu టీఎస్‌ ఐసెట్‌ 2020


అభ్యర్థులు టీఎస్‌ ఐసెట్‌ 2020 వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ద టెస్ట్‌ సెంటర్‌ ఆప్షన్‌ ద్వారా తమ పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో టీఎస్‌ ఐసెట్‌- 2020 పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు ఆగస్టు 5 వరకు రూ.1000 ఆలస్య రుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://icet.tsche.ac.in/

గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులకు అత్యున్నత కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి.. ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు. మారుతున్న ఉద్యోగావసరాలకనుగుణంగా జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు సాంకేతిక, వ్యాపార నైపుణ్యాన్ని అందించే ఈ కోర్సుల్లో చేరడానికి ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)..ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు.

Also read: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా..!

Also read: పరీక్షల తీరులోనూ పలు మార్పులు.. అన్నీ తరగతులకు పరీక్షలు ఉండవు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.