యాప్నగరం

టీఎస్‌ పాలిసెట్‌ దరఖాస్తు ప్రక్రియ.. polycetts.nic.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

sbtet.telangana.gov.in: పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 15వరకు స్వీకరించనున్నారు.

Samayam Telugu 24 May 2021, 11:34 am

ప్రధానాంశాలు:

  • నేటి నుంచి టీఎస్‌ పాలిసెట్‌ దరఖాస్తులు ప్రారంభం
  • జూన్‌ 11 దరఖాస్తులకు చివరితేది
  • రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 15 వరకు గడువు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu టీఎస్‌ పాలిసెట్‌ 2021
పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌-2021 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) కార్యదర్శి డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ షెడ్యూల్‌ జారీ చేశారు. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.300 ఆలస్య రుసుముతో జూన్‌ 15వరకు స్వీకరించనున్నారు.
పూర్తి వివరాలకు 040-23222192 కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు. అలాగే పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ https://www.sbtet.telangana.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ దరఖాస్తులను https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలని ఎస్‌బీటెట్‌ సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.