యాప్నగరం

టెన్త్‌ విద్యార్థులకు మరో అవకాశం.. గురుకుల కాలేజీల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.

Samayam Telugu 11 Jul 2020, 8:33 pm
తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం లభించింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్‌ కాలేజెస్‌ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TSRJC CET) 2020 పరీక్షకు దరఖాస్తు గడువును ఆగస్టు 5, 2020 వరకు పొడిగించారు.
Samayam Telugu టీఎస్‌ఆర్‌జేసీ


ఈ పరీక్ష ద్వారా గురుకుల కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లిష్‌ మీడియం-ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాలు పొందొచ్చు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత TREIS ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది.

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది.

మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కాలేజీలు, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

also read: ఇంటర్‌ సిలబస్ 30 శాతం ‌తగ్గింపు

also read: కేజీ నుంచి పీజీ వరకు.. ఇక్కడ అందరూ ఉచితంగా చదువుకోవచ్చు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.