యాప్నగరం

వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ..

వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై గురువారం (నవంబర్ 16) అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

TNN 16 Nov 2017, 6:49 pm
వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై గురువారం (నవంబర్ 16) అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నామని, నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచడానికి దక్షత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Samayam Telugu 13496 posts in telangana health department minister laxma reddy
వైద్య శాఖలో 13,496 పోస్టుల భర్తీ..


ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఎక్కువ మంది సర్కార్ దవాఖానల్లోనే చికిత్స తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. దీంతో ఆయా ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దోమల నివారణకు రాష్ట్రమంతటా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.