యాప్నగరం

పోస్టులు 18 వేలు.. దరఖాస్తులు 7 లక్షలు!

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 18,428 పోస్టులకుగాను 7.19 లక్షల దరఖాస్తులు.

Samayam Telugu 1 Jul 2018, 6:56 pm
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సబ్‌ ఇన్‌ స్పెక్టర్, తత్సమాన పోస్టులతో పాటు కానిస్టేబుల్, ఆ స్థాయిలోని వివిధ విభాగాల్లోని మొత్తం 18,428 పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు శనివారం (జూన్ 30)తో ముగిసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మొత్తం 7.19 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీసు నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
Samayam Telugu police


ఏ పోస్టులకు ఎంతమంది దరఖాస్తు..
* 1,271 ఎస్సై పోస్టులకు 1.88 లక్షల దరఖాస్తులు
* 16,925 కానిస్టేబుల్ పోస్టులకు 4.79 లక్షల దరఖాస్తులు
* 29 కమ్యూనికేషన్ ఎస్సై పోస్టులకు 13,944 దరఖాస్తులు
* 26 ఫింగల్ ప్రింట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 14,986 దరఖాస్తులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.