యాప్నగరం

ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ పోస్టులు

ఎయిర్ ఇండియా సదరన్ రీజియన్‌లో క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

TNN 19 Oct 2016, 4:30 pm
ఎయిర్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ క్యాబిన్ క్రూ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా సదరన్ రీజియన్‌లోని 300 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో మహిళలకు 75, పురుషులకు 225 కేటాయించారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డిగ్రీ లేదా హోటల్ మేనేజ్‌మెంట్/ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషుల కనీసం 172 సెం.మీ. ఎత్తు, మహిళలు కనీసం 160 సెం.మీ ఉండాలి. అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గ్రూప్ డైనమిక్స్, పర్సనాలిటీ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలి. దీనికి చివరితేది నవంబరు 8.
Samayam Telugu air india cabin crew posts notification in southern region
ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ పోస్టులు


NOTIFICATION
http://www.airindia.in/writereaddata/Portal/career/345_1_Advertisement2016.pdf

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.