యాప్నగరం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఏఐ) జూనియన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 15 Sep 2017, 7:09 pm
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఏఐ) జూనియన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లోని జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గేట్‌-2016లో అర్హత సాధించిన వారి ద్వారా భర్తీ చేస్తారు. ఏడాదికి రూ.7.5 లక్షల వేతనం చెల్లిస్తారు.
Samayam Telugu airports authority of india junior executive jobs notification
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు


జూనియర్ ఎగ్జిక్యూటివ్: 200
విభాగాలు: సివిల్ 50, ఎలక్ట్రికల్ 50, ఎలక్ట్రానిక్స్ 100.
విద్యార్హతలు: సివిల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. గేట్- 2016లో అర్హత సాధించాలి.
వయసు: 2017 సెప్టెంబరు 30 నాటికి 27 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం: గేట్-2016 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. దీని ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబరు 18
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 17

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.