యాప్నగరం

Amazon : 18,000 మంది ఉద్యోగులను తీసేసిన అమెజాన్‌.. కారణం ఏమిటంటే..?

Amazon layoff 18000 employees : అస్థిర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ఉద్యోగులకు బుధవారం ఓ లేఖ రాశారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 5 Jan 2023, 3:26 pm
Amazon Layoff to Hit Over 18000 employees : కొత్త ఏడాది (2023)లోనూ ఉద్యోగాల కోత (Layoffs) కొనసాగుతోంది. తాజాగా 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ప్రకటించింది. అస్థిర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ఉద్యోగులకు బుధవారం ఓ లేఖ రాశారు. నవంబరులోనే ఉద్యోగాల కోతపై అమెజాన్‌ (Amazon) ప్రకటన చేసింది. అప్పుడే కొంతమందికి ఉద్వాసన పలికింది.
Samayam Telugu Amazon Layoff


ఈ తొలగింపు (Layoffs) ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని పేర్కొంది. అన్ని విభాగాల్లో లోతైన సమీక్ష జరిపి పునర్‌వ్యవస్థీకరణ అవసరమైన చోట ఉద్యోగుల తొలగింపు (Layoffs) ఉంటుందని వెల్లడించింది. నవంబరులోనే ప్రకటించినప్పటికీ.. కొంతమందిని ఇప్పటి వరకు తొలగించలేదు. వారిని కూడా తాజా 18,000 ఉద్యోగాల తొలగింపు ప్రక్రియలో చేర్చినట్లు జస్సీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

తమ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయం తమకు తెలుసని జస్సీ అన్నారు. అయినప్పటికీ.. తప్పని పరిస్థితుల్లోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్వాసనకు గురయ్యే వారికి తమ సహకారం ఉంటుందని జస్సీ తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలతో పాటు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, కొత్త ఉద్యోగాల వేటలో సాయం చేస్తామని ప్రకటించారు. ఐరోపాలోనూ తొలగింపులు తప్పవని తెలిపారు.

సేల్స్‌ఫోర్స్‌ (Salesforce)లో 8,000 మంది ఇంటికి: బిజినెస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ (Salesforce) సైతం 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇది ఈ కంపెనీ మొత్తం సిబ్బందిలో 10 శాతానికి సమానం. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద తొలగింపు ప్రక్రియ. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఐదు నెలల వేతనంతో పాటు ఆరోగ్య బీమా, కొత్త ఉపాధి ఏర్పాటుకు సహకారం అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.