యాప్నగరం

Jagananna Amma Vodi: అమ్మ ఒడి డబ్బులు రావాలంటే ఇవి తప్పనిసరి.. వెంటనే ఈ పనులు చేయండి

Amma Vodi Scheme in Andhra Pradesh: ప్రభుత్వం.. 2022లో హాజరను ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చి జూన్ నెలకు వాయిదా వేసింది. దీనిపై తల్లిదండ్రులకు సమాచారం అందిస్తోంది.

Samayam Telugu 17 Apr 2022, 5:12 pm
Jagananna Amma Vodi: ఆంధ్రప్రదేశ్‌లో 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం.. 2022లో హాజరను ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తీసుకొచ్చి జూన్ నెలకు వాయిదా వేసింది. దీనిపై తల్లిదండ్రులకు సమాచారం అందిస్తోంది. అంతేకాదు కొత్త రూల్స్ ని కూడా గుర్తుచేస్తోంది. అమ్మ ఒడి (Amma Vodi) లబ్ధిదారులు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తే అమ్మఒడి పథకం వర్తించదని స్పష్టం చేసింది. 300 లోపు విద్యుత్ వినియోగం ఉంటేనే నగదు అందుతుంది. ఈ మేరకు అర్హతలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


అంతేకాకుండా.. గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు హాజరు 75శాతం కంటే తక్కువగా ఉంటే.. అమ్మ ఒడి ప్రయోజనం రాదు. అలాగే కొత్త బియ్యం కార్డు, కొత్త జిల్లాల ఆధారంగా ఆధార్ కార్డులో జిల్లా పేరు మార్చుకోవలసి ఉంటుంది. అలాగే ఆధార్.. బ్యాంక్ ఎకౌంట్ లింక్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ ఎకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్‌లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి మరియు స్టూడెంట్ వివరాలు అంటే వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేకుంటే వాలంటీర్ వద్ద e-KYC ద్వారా అప్‌డేట్‌ చేసుకోవాలి.

ఏపీలో కాలేజీలకు వేసవి సెలవులు.. తేదీలు వెల్లడి:
AP Colleges Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కాలేజీలకు సంబంధించి మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్ ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. 1 నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్ - 2 ఎగ్జామ్స్ ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆ ఎగ్జామ్స్ పూర్తి కాగానే వారికి సెలవులు ప్రకటించనున్నారు అధికారులు. ఇదిలా ఉంటే జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

స్కూళ్లకు మే 9 నుంచి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్న విషయం ప్రకటించింది. రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యార్థులకు కనీసం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కరోనా తీవ్ర తగ్గడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు పూర్తవగానే ఎండాకాలం సెలవులు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.