యాప్నగరం

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 11 Nov 2016, 6:41 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇ బ్యాక్‌లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu andhra pradesh dept of animal husbandry veterinary assistant surgeon posts
ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు

పోస్టుల సంఖ్య: 57
జోన్ల వారిగా పోస్టులు: జోన్ 1-11, జోన్ 2- 28, జోన్ 3- 1, జోన్ 4- 17
అర్హతలు: వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీలో డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఏపీలోని సంబంధిత జోన్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను లోకల్, నాన్-లోకల్ (70: 30) విధానంలో భర్తీ చేస్తారు.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్ లేదా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారాThe Director, Department of Animal Husbandry, Dr NTR SSVH Campus, Labbipeta, Vijyawada, Andhra Pradesh– 520010 చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: నవంబరు 28

నోటిఫికేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.