యాప్నగరం

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ 2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు.

TNN 5 May 2017, 3:42 pm
ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ 2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 79.74 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి గంటా వెల్లడించారు. తొలిసారి ఆన్‌లైన్‌లో ఎంసెట్ నిర్వహించామని, మొత్తం 128 కేంద్రాల్లో పరీక్ష జరిగిందని గంటా చెప్పారు.
Samayam Telugu andhra pradesh eamcet 2017 results released
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల


ఇంజినీరింగ్‌లో లక్షా 23 వేల 974 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 55,289 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ర్యాంకులు, మార్కుల వివరాలను విద్యార్థుల మొబైల్‌ఫోన్లకు పంపించనున్నారు. ఈ నెల 12 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రులు తెలిపారు.

కాగా, ఇంజినీరింగ్‌లో వి. మోహన్ అబ్బాస్‌ (153.95) మొదటి ర్యాంకు సాధించాడు. ఎ. సాయి భరద్వాజ్ (152.73) రెండో ర్యాంకు, ఆర్. సత్యం (152.52) మూడో ర్యాంకు సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.